ఆరోజు అమావాస్య.. ముఖ్యమంత్రి వచ్చేది కష్టమే!

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేసిన మూడేండ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ చేతులమీదుగానే కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉంటాయని ప్రచారం సాగింది. ప్రచారానికి ఊతమిస్తూ గత నాలుగు రోజులుగా జిల్లా కార్యాలయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పర్యటన ప్రస్తుతానికి అధికారికంగా వెలువడకపోయినా ఆయన చేతుల మీదుగానే […]

Update: 2021-06-08 07:01 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేసిన మూడేండ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ చేతులమీదుగానే కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉంటాయని ప్రచారం సాగింది. ప్రచారానికి ఊతమిస్తూ గత నాలుగు రోజులుగా జిల్లా కార్యాలయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పర్యటన ప్రస్తుతానికి అధికారికంగా వెలువడకపోయినా ఆయన చేతుల మీదుగానే కార్యాలయాల ప్రారంభోత్సవం ఉంటుందని ఏర్పాట్లను చూస్తే స్పష్టం అవుతోంది. అయితే ఈ నెల 10 వ తేదీన సీఎం పర్యటన ఉంటుందని అందరూ భావించినా.. ఆయన పర్యటనకు అమావాస్య చిక్కు వచ్చింది.

ముహూర్తలను చూసుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమానికైనా సీఎం శ్రీకారం చూడతారని గతంలో జరిగిన కార్యక్రమాలు సూచిస్తున్నాయి. జిల్లా కార్యాలయాల భవనాలకు 10వ తేదీన ప్రారంభోత్సవం చేస్తారని ప్రచారం సాగించినా ఆరోజు అమావాస్య కావడంతో సీఎం కార్యక్రమం ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ వస్తారని ఆశించారు. ఆరోజు అమావాస్య కావడం వల్లనే ఆయన రాలేకపోయారాని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ నెల 5న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి కార్యాలయాల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా 10వ తేదీన ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని డీజీపీ తెలుపగా 10 నుంచి 15 వ తేదీ లోపు ఎప్పుడైనా సీఎం కార్యక్రమం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ నెల 12 లేదా 14 వ తేదీన సీఎం పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. పర్యటనకు సంబందించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

Tags:    

Similar News