తెలంగాణలో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలన్న కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రజలను అప్రమత్తం చేశారు. అందుకే వర్షాలు అత్యధికంగా కురిసే ప్రాంతాల్లో ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎస్సారెస్పీకి వరద ఉధృతి బాగా పెరిగిందని గుర్తు చేసిన సీఎం.. పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిజామాబాద్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రజలను అప్రమత్తం చేశారు. అందుకే వర్షాలు అత్యధికంగా కురిసే ప్రాంతాల్లో ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎస్సారెస్పీకి వరద ఉధృతి బాగా పెరిగిందని గుర్తు చేసిన సీఎం.. పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిజామాబాద్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. గోదావరి, కృష్ణా ప్రాంతాల నుంచి అధికంగా వరదలు వస్తున్నాయని.. ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారని చెప్పారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముంపు ప్రాంతాలకు పంపాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.