AP News : కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖ

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర జలవనరులు, అటవీ, పర్యావరణశాఖ మంత్రులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లేఖలు రాశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తెలంగాణ వినియోగిస్తుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలన్నారు. అంతే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టులో […]

Update: 2021-07-05 02:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర జలవనరులు, అటవీ, పర్యావరణశాఖ మంత్రులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లేఖలు రాశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తెలంగాణ వినియోగిస్తుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలన్నారు. అంతే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News