బహ్రెయిన్‌ బాధితులకు కేంద్రం అండ.. జగన్ లేఖతో కదిలిన వైనం

దిశ, ఏపీ బ్యూరో : బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు కార్మికులను కాపాడాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖకు కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. ఇటీవలే బహ్రెయిన్‍లో తెలుగు కార్మికుల కష్టాలను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. విదేశాంగశాఖ చొరవతో కార్మికులు, మేనేజ్‌మెంట్‍తో బహ్రెయిన్ అధికారులు మాట్లాడారు. కార్మికులు-మేనేజ్మెంట్‌తో చర్చించి..సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల సమస్య పరిష్కారమైందని బహ్రెయిన్‍లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. […]

Update: 2021-09-14 11:21 GMT

దిశ, ఏపీ బ్యూరో : బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు కార్మికులను కాపాడాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖకు కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. ఇటీవలే బహ్రెయిన్‍లో తెలుగు కార్మికుల కష్టాలను పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. విదేశాంగశాఖ చొరవతో కార్మికులు, మేనేజ్‌మెంట్‍తో బహ్రెయిన్ అధికారులు మాట్లాడారు. కార్మికులు-మేనేజ్మెంట్‌తో చర్చించి..సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల సమస్య పరిష్కారమైందని బహ్రెయిన్‍లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. సీఎం లేఖపై సత్వరమే స్పందించిన విదేశాంగశాఖకు ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News