CM Jagan: కుప్పంలో టెన్షన్.. టెన్షన్..! నేడు నియోజకవర్గానికి సీఎం జగన్ రాక

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

Update: 2024-02-26 04:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం రాజుపేట్, రామకుప్పం మండలంలో సిద్ధం చేసిన హెలిప్యాడ్‌ వద్ద హెలికాప్టర్ దిగుతారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజలు చేసి నీటిని విడుదల చేస్తారు. ఇక 11.25‌కు గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు హాజరుకానున్నారు. సీఎం నియోజకవర్గానికి వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా, గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ హంద్రీ, నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ మేరకు ఇవాళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను మరికాసేపట్లో విడుదల చేయబోతున్నారు. దీంతో తాగు, సాగునీటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల ఆకాంక్ష నేటితో నెరవేరబోతోంది. 

Also Read..

Breaking: నేడు ఆ జిల్లాలో నారా చంద్రబాబు పర్యటన.. 

Tags:    

Similar News