గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ మీటింగ్.. కీలక అంశాలు ఇవే!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. అమరావతిలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైన జగన్.. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించారు. ఇప్పటికే ప్రతిపాదిత పేర్ల జాబితాను గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపించింది. కాగా, ప్రభుత్వం సూచించిన అభ్యర్థుల ఎన్నిక విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనకు బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకారం తర్వాత ఏపీలో ఖాళీ అయిన […]

Update: 2021-06-14 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. అమరావతిలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైన జగన్.. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించారు.

ఇప్పటికే ప్రతిపాదిత పేర్ల జాబితాను గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపించింది. కాగా, ప్రభుత్వం సూచించిన అభ్యర్థుల ఎన్నిక విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనకు బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకారం తర్వాత ఏపీలో ఖాళీ అయిన స్థానాల ఎన్నిక పూర్తి కానుంది. అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Tags:    

Similar News