వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులతోపాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి టీకాలు వేయాల్సిందిగా ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రాధాన్యక్రమంగా వ్యాక్సిన్‌లు వేయాలని ఆదేశించారు. గ్రామం యూనిట్‌గా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని తెలిపారు. 45ఏళ్ల […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులతోపాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి టీకాలు వేయాల్సిందిగా ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రాధాన్యక్రమంగా వ్యాక్సిన్‌లు వేయాలని ఆదేశించారు. గ్రామం యూనిట్‌గా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు.
ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని తెలిపారు. 45ఏళ్ల లోపు వారందరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అంతా టీకాలు వేయించుకోవాలన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కార్డు డిజిటలైజేషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలని సీఎం జగన్ సూచించారు.