మంత్రి అనిల్‌ను అభినందించిన సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. శాసన సభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్ స్వీప్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన […]
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. శాసన సభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో క్లీన్ స్వీప్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్పారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇన్ చార్జ్ భూమన కరుణాకర్ రెడ్డిలను కూడా సీఎం జగన్ అభినందించారు. అలాగే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కూడా ఈ సందర్భంగా అభినందించారు. ఇకపోతే నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు గానూ 8 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే.