గ్రాఫిక్స్ చూపించ లేను : సీఎం జగన్

      ‘‘నేనెంత చేయగలుగుతానో అంతే చేసి చూపిస్తా… బాహుబలి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టడం నాకు చేతకాదు’’ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒక సీఎంగా నేను తీసుకునే కీలక నిర్ణయాలు భావి తరాల భవిష్యత్ కోసమే ఆయన తెలిపారు. ఇవాళ ద హిందూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యూకేషన్ ప్రోగ్రాంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… రాష్ర్టంలో నిరక్ష్యరాస్యత 33శాతం ఉందనీ, అందుకే మొత్తం విద్యావ్యవస్థనే […]

Update: 2020-02-05 00:51 GMT

‘‘నేనెంత చేయగలుగుతానో అంతే చేసి చూపిస్తా… బాహుబలి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టడం నాకు చేతకాదు’’ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒక సీఎంగా నేను తీసుకునే కీలక నిర్ణయాలు భావి తరాల భవిష్యత్ కోసమే ఆయన తెలిపారు. ఇవాళ ద హిందూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యూకేషన్ ప్రోగ్రాంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… రాష్ర్టంలో నిరక్ష్యరాస్యత 33శాతం ఉందనీ, అందుకే మొత్తం విద్యావ్యవస్థనే మార్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.1.09 కోట్లు కావాలని, కానీ గత ప్రభుత్వం రూ.5000 కోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. కీలక మౌళిక సదుపాయాలకు ఎకరాకు రూ.2కోట్లు అవుతుంది. ఇంత ఖర్చుతో అమరావతి నిర్మాణం కష్టం అవుతుందని, ప్రభుత్వం దగ్గర అమరావతి నిర్మించేంత నిధులు లేవు అని స్పష్టం చేశారు. లక్షకోట్లు పెట్టలేకే రాజధాని మార్పు జరుగుతుందని తెలిపారు. అమరావతిలో 5200 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉండటంతో పాటు, అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన తెలిపారు. విశాఖ అభివృద్ధి చెందిన నగరం. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అమరావతిలో చేసే ఖర్చులో 10శాతం విశాఖలో చేస్తే పదేండ్లలో హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలతో అభివృద్ధిలో పోటీ పడుతుందన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం చేయకుండా సమన్యాయ పాలన చేస్తున్నామన్నారు. సింగపూర్, జపాన్ తరహా సిటీలను గ్రాఫిక్స్‌లో చూపించలేను. వాటిలా నిర్మించేంత నిధులు కూడా మన దగ్గర లేవని విమర్శించారు. బాహుబలి గ్రాఫిక్స్ లాంటి లేని పోనివి చూపించి జనాన్ని మోసం చేయడం నాకు రాదని, ప్రజలకు మభ్యపెట్టడానికి గ్రాఫిక్స్ చూపించలేమని, నేనెంత చేయగలుగుతానో అంతే చేసి చూపిస్తానని ఆయన అన్నారు.

Tags:    

Similar News