వారు లేకున్నా ఒకే.. కానీ అట్లా వద్దు
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం ముగిసింది. సీఎం గెహ్లాట్ నివాసంలో సీఎల్పీ భేటీ జరిగింది. దాదాపు నెల రోజుల తరువాత సీఎం గెహ్లాట్.. సచిన్ పైలట్ ఒకరినొకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ చేసుకుంటూ.. నవ్వులు పూయించుకున్నారు. అయితే గెహ్లాట్‌కు ఇటీవల జరిగిన పరిణామాలు గుర్తుకు వచ్చాయో ఏమో.. సచిన్ పైలట్‌కు పరోక్షంగా చురకలంటించారు. ‘‘ గతంలో జరిగిందంతా మరిచిపోండి.. నేను బల పరీక్ష ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను. తనపై అవిశ్వాస తీర్మాణం పెడతామని ఇప్పటికే […]
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం ముగిసింది. సీఎం గెహ్లాట్ నివాసంలో సీఎల్పీ భేటీ జరిగింది. దాదాపు నెల రోజుల తరువాత సీఎం గెహ్లాట్.. సచిన్ పైలట్ ఒకరినొకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ చేసుకుంటూ.. నవ్వులు పూయించుకున్నారు. అయితే గెహ్లాట్‌కు ఇటీవల జరిగిన పరిణామాలు గుర్తుకు వచ్చాయో ఏమో.. సచిన్ పైలట్‌కు పరోక్షంగా చురకలంటించారు.
‘‘ గతంలో జరిగిందంతా మరిచిపోండి.. నేను బల పరీక్ష ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను. తనపై అవిశ్వాస తీర్మాణం పెడతామని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలు లేకుండానే మెజారిటీని నిరూపించుకుంటా.. అయితే అది నాకు ఎట్టిపరిస్థితుల్లో సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకుంటే వాళ్లు మన పార్టీ వాళ్లే కదా.. గతంలో జరిగింది మరిచిపోండి’’. అని పైలట్‌కు చురకలంటించారు.