పంజాబ్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ గవర్నర్‌ వీపీ సింగ్ బద్నూర్‌పై ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దమైన గవర్నర్ పదవిని అపహస్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై బీజేపీ చేస్తున్న ప్రచారానికి గవర్నర్ తలొగ్గుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఏదైనా వివరణ కావాల్సి వస్తే అధికారులను కాదని, హోం శాఖను కూడా చూస్తున్న తనను పిలవాలని అమరేందర్ సింగ్ అన్నారు. రైతు చట్టాలకు […]

Update: 2021-01-02 11:11 GMT
పంజాబ్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ గవర్నర్‌ వీపీ సింగ్ బద్నూర్‌పై ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దమైన గవర్నర్ పదవిని అపహస్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై బీజేపీ చేస్తున్న ప్రచారానికి గవర్నర్ తలొగ్గుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఏదైనా వివరణ కావాల్సి వస్తే అధికారులను కాదని, హోం శాఖను కూడా చూస్తున్న తనను పిలవాలని అమరేందర్ సింగ్ అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News