దేశ చరిత్రలో తెలంగాణలోనే తొలిసారి
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బుధవారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ (cabinet meeting) కేటీఆర్ అధ్యక్షతన జరిగిందనే వార్త టీవీల్లో చూసి ఆశ్చర్యం కల్గిందన్నారు. ప్రస్తుత్తం కరోనా(corona) విజృంభిస్తున్నా.. ఫుడ్ ప్రాసెసింగ్(food processing), లాజిస్టిక్ పాలసీ(logistic policy) వంటి అంశాలపై సీఎం కాని వ్యక్తి సీఎం హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో తెలంగాణలోనే తొలిసారి అనే అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. ఏ హోదాలో కేటీఆర్ కేబినెట్ సమావేశం […]
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బుధవారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ (cabinet meeting) కేటీఆర్ అధ్యక్షతన జరిగిందనే వార్త టీవీల్లో చూసి ఆశ్చర్యం కల్గిందన్నారు. ప్రస్తుత్తం కరోనా(corona) విజృంభిస్తున్నా.. ఫుడ్ ప్రాసెసింగ్(food processing), లాజిస్టిక్ పాలసీ(logistic policy) వంటి అంశాలపై సీఎం కాని వ్యక్తి సీఎం హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో తెలంగాణలోనే తొలిసారి అనే అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు.
ఏ హోదాలో కేటీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహించారో స్పష్టం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. అసలు సీఎం ఇక్కడే ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని భట్టి అన్నారు. పాలన అంటే కేటీఆర్ కుటుంబ వ్యవహారం కాదని.. కోట్లాది మంది ప్రజలకు సంబంధమైన విషయమని భట్టి అన్నారు.