డైనోసార్ల అంతానికి అది కారణం కాదట!

డైనోసార్లు, అప్పటి జీవజాలం ఎలా అంతరించిందనే ప్రశ్నకు చాలామంది ఉల్కాపాతం అని గానీ, వాతావరణ మార్పులనిగానీ సమాధానం చెబుతారు. అవి అంతరించిపోవడానికి, వీరు చెప్తున్న సమాధానాలకు ఎలాంటి సంబంధం లేదని ఓ కొత్త పరిశోధనలో తేలింది. 215 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ పీరియడ్‌లో 90 శాతానికిపైగా జీవజాలం అంతరించపోవడానికి మరేదో కారణం ఉందని యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలండ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అవన్నీ ఒకే ఒక సంఘటన ద్వారా అంతరించలేదని, అవి అంతరించిపోయే […]

Update: 2020-06-04 06:56 GMT

డైనోసార్లు, అప్పటి జీవజాలం ఎలా అంతరించిందనే ప్రశ్నకు చాలామంది ఉల్కాపాతం అని గానీ, వాతావరణ మార్పులనిగానీ సమాధానం చెబుతారు. అవి అంతరించిపోవడానికి, వీరు చెప్తున్న సమాధానాలకు ఎలాంటి సంబంధం లేదని ఓ కొత్త పరిశోధనలో తేలింది. 215 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ పీరియడ్‌లో 90 శాతానికిపైగా జీవజాలం అంతరించపోవడానికి మరేదో కారణం ఉందని యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలండ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అవన్నీ ఒకే ఒక సంఘటన ద్వారా అంతరించలేదని, అవి అంతరించిపోయే ప్రక్రియ దశలవారీగా జరిగి ఉంటుందని వారు అంటున్నారు.

అరిజోనాలోని పెట్రిఫైడ్ ఫారెస్ట్ జాతీయ పార్కులో 227 నుంచి 205 మిలియన్ సంవత్సరాలనాటి అవశేషాల మీద సైంటిస్టులు, స్టాటిస్టిషియన్ల బృందం కలిసి ఈ పరిశోధన చేసింది. అడమేనియన్-రెవ్యూల్టియన్ టర్నోవర్‌గా పిలిచే ఈ అంతరించే క్రమానికి సంబంధించి గతంలో వచ్చిన సిద్ధాంతాలను ఎవరూ ప్రశ్నించలేదు, అందుకే తాము ఈ అంశాన్ని ఎంచుకుని పరిశోధిస్తే ఆ కాలంనాటి జంతువులను పునర్నిర్మాణం చేయలేకపోతున్నట్లు ప్రొఫెసర్ డేవిడ్ ఫాస్టోవ్‌స్కీ తెలిపారు. దీని గురించి లోతుగా పరిశీలిస్తే ఉల్కాపాతం జరిగినట్లుగానీ, వాతావరణ మార్పుల ఆధారాలుగానీ ఏమీ కనిపించలేదని అన్నారు. ఇదొక క్రమపద్ధతిలో 222 మిలియన్ సంవత్సరాల నుంచి 212 మిలియన్ సంవత్సరాల మధ్య నెమ్మదిగా జరిగినట్లు మాత్రం చెప్పగలమని డేవిడ్ అన్నారు. ఆ కాలంలో ఆస్టరాయిడ్ పడిన మాట, వాతావరణ మార్పులు వచ్చినమాట నిజమే కానీ, వాటి వల్ల పూర్తి జీవజాలం అంతరించిపోలేదని తమ పరిశోధనలో తేలినట్లు డేవిడ్ వివరించారు.

Tags:    

Similar News