ఆ విగ్రహాలు ప్రమాదం.. బంకమట్టి వినాయకులనే పూజిద్దాం..!
దిశ, మణుగూరు: వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన విగ్రహాలనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆర్యవైశ్య సంఘం సభ్యులు దోసపాటి పిచ్చేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అశ్వాపురం మండలంలో ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉచిత మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర, విషపూరిత రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణానికి తీవ్రనష్టం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రంగుల వినాయక విగ్రహాల తయారీలో […]
దిశ, మణుగూరు: వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన విగ్రహాలనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆర్యవైశ్య సంఘం సభ్యులు దోసపాటి పిచ్చేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అశ్వాపురం మండలంలో ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉచిత మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర, విషపూరిత రంగులతో ఆకర్షణీయంగా తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణానికి తీవ్రనష్టం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రంగుల వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, గంధకం, పీఓపీ, మెగ్నీషియం, సీసం లాంటి రంగులు ప్రమాదకరమని భక్తులకు సూచించారు. బంగారమైన బంకమట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేసుకొని పూజించుకుని, పర్యావరణాన్ని కాపాడుదమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.