ప్రేమోన్మాది దారుణం: కాలేజ్ క్యాంపస్ లో అందరూ చూస్తుండగానే విద్యార్థిని గొంతుకోసి

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ప్రేమ, నమ్మకం, కోపం, కామం, క్రోధం వంటివి ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో యువత చేస్తున్న చిన్న తప్పులు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. తమను ప్రేమించినవారు తమతో గొడవపడుతున్నారని, విసిగిపోయి వారు ప్రాణాలు తీసుకోవడమో, ప్రేమించిన వారి ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. తాజాగా ప్రియురాలితో గొడవపడి, క్షణికావేశంలో ఆమె గొంతుకోసి హతమార్చాడు ఓ ప్రేమికుడు. అనంతరం భయపడకుండా ప్రియురాలి శవం వద్దనే ఉండి పోలీసులుకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు […]

Update: 2021-10-02 00:13 GMT
ప్రేమోన్మాది దారుణం: కాలేజ్ క్యాంపస్ లో అందరూ చూస్తుండగానే విద్యార్థిని గొంతుకోసి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ప్రేమ, నమ్మకం, కోపం, కామం, క్రోధం వంటివి ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో యువత చేస్తున్న చిన్న తప్పులు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. తమను ప్రేమించినవారు తమతో గొడవపడుతున్నారని, విసిగిపోయి వారు ప్రాణాలు తీసుకోవడమో, ప్రేమించిన వారి ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. తాజాగా ప్రియురాలితో గొడవపడి, క్షణికావేశంలో ఆమె గొంతుకోసి హతమార్చాడు ఓ ప్రేమికుడు. అనంతరం భయపడకుండా ప్రియురాలి శవం వద్దనే ఉండి పోలీసులుకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కొట్టాయం జిల్లాకు చెందిన నితినా మోల్‌(21) స్థానిక సెయింట్ థామస్‌ కాలేజీలో చదువుతోంది. అక్కడ తనతో పాటే చదువుతున్న అభిషేక్‌ (21) అనే యువకుడితో ప్రేమలో పడింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ప్రేమ జంట మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా అభిషేక్ కి నితినా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం కాలేజ్‌లో సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చింది. ఆమె బయటకు రాగానే అభిషేక్ ఆమెను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ప్రియురాలిపై కోపోద్రిక్తుడైన అభిషేక్ అక్కడే అందుబాటులో ఉన్న పేపర్లు కట్‌ చేసే కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుకొని నితినా అక్కడికక్కడే మృతిచెందింది.

ఊహించని పరిణామంతో స్టూడెంట్స్ అందరూ బెంబేలెత్తిపోయారు. ప్రియురాలిని అంత దారుణంగా చంపి కూడా అభిషేక్ భయపడలేదు. పోలీసులు వచ్చేవరకు ఆమె శవం పక్కనే ఉన్నాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అభిషేక్ విద్యార్ధులు చూస్తుండగానే హత్య చేయడం వెనక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం పోలీసులు దృష్టిసారించినట్టు చెప్పారు.

హీరోయిన్ ని తమతో గడపమని బలవంతం చేసిన డైరెక్టర్, హీరో.. అర్ధరాత్రి రూమ్ కి వచ్చి

Tags:    

Similar News