కమిటీ సభ్యులు అభిప్రాయం మార్చుకోవచ్చు : ఎస్ ఏ బాబ్డే!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో భాగమైన ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే మంగళవారం అభిప్రాయపడ్డారు. ప్యానెల్‌లో సభ్యులుగా ఎంపిక చేయడానికి ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని అనర్హులుగా ప్రకటించడానికి కుదరదని చెప్పారు. వ్యవసాయ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉంది. కమిటీలో భాగం కావడానికి ముందు ఒక వ్యక్తిని ఒక అభిప్రాయం ఉండవచ్చు. […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో భాగమైన ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే మంగళవారం అభిప్రాయపడ్డారు. ప్యానెల్‌లో సభ్యులుగా ఎంపిక చేయడానికి ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని అనర్హులుగా ప్రకటించడానికి కుదరదని చెప్పారు.
వ్యవసాయ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉంది. కమిటీలో భాగం కావడానికి ముందు ఒక వ్యక్తిని ఒక అభిప్రాయం ఉండవచ్చు. తర్వాత ఆ అభిప్రాయం మారవచ్చు. ఎవరైన ఈ విషయంపై ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తిని కమిటీలో సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడం ఉండదు. కమిటీ సభ్యులు న్యాయమూర్తులు కాదని గుర్తించుకోండి’ అని బోబ్డే వెల్లడించారు.