తీరని అన్యాయం చేస్తోన్నది: నూర్జహాన్

దిశ, నిజామాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకు వచ్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని, స్వర్ణోత్సవాల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలని కార్మిక వర్గానికి సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నూర్జహాన్ పిలుపు నిచ్చారు. సీఐటీయూ ఆవిర్భావ స్వర్ణోత్సవాల సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాందేవ్ వాడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆయన జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా […]

Update: 2020-05-30 01:43 GMT
తీరని అన్యాయం చేస్తోన్నది: నూర్జహాన్
  • whatsapp icon

దిశ, నిజామాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకు వచ్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని, స్వర్ణోత్సవాల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలని కార్మిక వర్గానికి సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నూర్జహాన్ పిలుపు నిచ్చారు. సీఐటీయూ ఆవిర్భావ స్వర్ణోత్సవాల సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాందేవ్ వాడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆయన జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై మానవ హారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఐక్యత, పోరాటం నినాదంతో 1970లో కొల్ కత్తా పట్టణంలో ఆవిర్భవించిందన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు కార్మిక వర్గ సమస్యలపై ఛాంపియన్ గా నిలిచి పోరాడుతున్న సంఘం సీఐటీయూ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కార్మికుల పక్షాన నిలిచి పోరాడి అనేక హక్కులను సాదించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, మల్యాల గోవర్ధన్, టి.చక్రపాణి, కులకర్ణి శ్రీనివాస్ రాజ్, డి.కృష్ణ, వాణి, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News