క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు కొట్టేసిన ఉద్యోగి సస్పెండ్

        అన్ని కలిపి అతని జీతం సంవత్సరానికి రూ. 9.3 కోట్లు. కానీ ఈ మధ్య అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. కారణం మాత్రం ఎవ్వరు అడిగినా కూడా చెప్పలేదు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే… అతను వెళ్లడానికి కారణం కంపెనీ క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు కొట్టేయడం.         అవును… అమెరికాకు చెందిన సిటీ గ్రూప్ వారు తమ లండన్ శాఖలో పనిచేస్తున్న 31 ఏళ్ల పరాస్ షాను […]

Update: 2020-02-05 00:42 GMT

న్ని కలిపి అతని జీతం సంవత్సరానికి రూ. 9.3 కోట్లు. కానీ ఈ మధ్య అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. కారణం మాత్రం ఎవ్వరు అడిగినా కూడా చెప్పలేదు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే… అతను వెళ్లడానికి కారణం కంపెనీ క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు కొట్టేయడం.

అవును… అమెరికాకు చెందిన సిటీ గ్రూప్ వారు తమ లండన్ శాఖలో పనిచేస్తున్న 31 ఏళ్ల పరాస్ షాను తొలగించింది. పరాస్ బ్యాంకులో పనిచేస్తున్న అత్యంత సీనియర్ బాండ్ ట్రేడర్. కానీ అతన్ని తొలగించిన కారణం చాలా వ్యక్తిగతమైనది. పరాస్ గత కొన్ని నెలలుగా స్టాఫ్ క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు దొంగతనం చేసి ఇంటికి పట్టుకుపోతున్నాడని వచ్చిన ఆరోపణల మేరకు అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని శాండ్‌విచ్‌లు దొంగిలించాడు, ఎంత కాలం నుంచి దొంగిలిస్తున్నాడు అనే విషయం మీద స్పష్టత లేదు.

Tags:    

Similar News