గుడ్‌న్యూస్.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు మంగళవారం Drugs Controller General of India (DCGI) అనుమతినిచ్చింది. అత్యవసర వినియోగానికి మోడెర్నాకు అనుమతి లభించింది. ఈ క్రమంలో మెడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా సంస్థ దిగుమతి చేసుకోనున్నది. అయితే, ఇప్పటికే భారత్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా దేశప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు మంగళవారం Drugs Controller General of India (DCGI) అనుమతినిచ్చింది. అత్యవసర వినియోగానికి మోడెర్నాకు అనుమతి లభించింది. ఈ క్రమంలో మెడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా సంస్థ దిగుమతి చేసుకోనున్నది.
అయితే, ఇప్పటికే భారత్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా దేశప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మోడెర్నా టీకా అమెరికా, బ్రిటన్, తదితర దేశాల్లో అందుబాటులో ఉంది.
Cipla gets DCGI nod to import Moderna's COVID-19 vaccine for restricted emergency use in India: Sources
— Press Trust of India (@PTI_News) June 29, 2021