Kiran Abbavaram : నెక్ట్స్ ఫైరే.. తదుపరి చిత్రంపై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన యంగ్ హీరో (పోస్ట్)

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry) ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2024-12-11 15:47 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry) ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు సినిమాల్లో నటించిన మెప్పించిన ఈ హీరోకి సూపర్ హిట్ (Super Hit) మాత్రం పడలేదు. ఇక ఈ ఏడాది ‘క’ (Kaa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ సోషల్ మీడియా (Social Media)లో బాగా వైరల్ అయ్యాయి.

‘క’ హిట్ కాకపోతే ఇకపై సినిమాలు తీసేదే లేదు అని బహిరంగంగా కామెంట్స్ (Comments) చేశాడు. ఇక మూవీ రిలీజ్ తర్వాత సూపర్ హిట్ అందుకోవడంతో కిరణ్ అబ్బవరం క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. దీంతో ఈయన తీసే నెక్ట్స్ ప్రాజెక్ట్ (Next Project) పై ఆడియన్స్ (audience) దృష్టి మళ్లింది. ఈసారి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడా అని ఎదురు చూస్తోన్న క్రమంలో తాజాగా కిరణ్ అబ్బవరం పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ మేరకు బ్లూ కలర్ షార్ట్‌లో స్టైలిష్‌గా ఉన్న లుక్‌ను షేర్ చేస్తూ.. ‘నెక్ట్స్ ఫైరే.. అప్‌డేట్ త్వరలో రాబోతుంది’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో ఆ సినిమా ఏంటీ అనేది నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది.

Tags:    

Similar News