వావ్.. వీళ్లు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘అతడు’ మూవీలోని ఆ సీన్‌ను అచ్చుగుద్దేశారుగా..(వీడియో)

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram) కాంబోలో తెరకెక్కిన సినిమా 'అతడు'(Athadu).

Update: 2025-04-13 04:17 GMT
వావ్.. వీళ్లు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘అతడు’ మూవీలోని ఆ సీన్‌ను అచ్చుగుద్దేశారుగా..(వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram) కాంబోలో తెరకెక్కిన సినిమా 'అతడు'(Athadu). ఇకఈ మూవీలో స్టార్ బ్యూటీ త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించింది. అయితే 2005లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో మిక్స్​డ్ టాక్ దక్కించుకుంది. కానీ మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ యూత్ ఫేవరేట్ లిస్ట్‌లో ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే ఈ మూవీలో పార్ధు(మహేష్ బాబు), పూరీ(త్రిష)ల మధ్య వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్ ఇప్పుడు చూసిన నవ్వకుండా ఉండలేరు. అదేనండి త్రిష బట్టలు మడత పెట్టి వెళ్తున్నప్పుడు మహేష్ బాబు కాళ్లు అడ్డుపెట్టి త్రిషను కిందపడేస్తాడుగా.. అప్పుడు త్రిష నువ్వే పడేశావు అని అనగా.. నేను ఇక్కడ కూర్చుంటే నా కాళ్లు అక్కడి వరకు ఎలా వస్తాయి అని మహేష్ బాబు అనగా.. అప్పుడు ఎందుకు రావు వస్తాయి.

ఇప్పుడు నేను చేసి చూపించనా అంటూ త్రిష ప్రయత్నం చేస్తున్న టైంలో కుర్చీ నుంచి కింద పడిపోతుందిగా ఆ సీన్. ప్రజెంట్ ఇదే సీన్‌ను రీక్రియేట్ చేశారు ఈ బుడ్డోళ్లు. సేమ్ మహేష్ బాబు, త్రిషలా యాక్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వీళ్లు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, సేమ్ టు సేమ్ దించేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News

Vaishnavi Chaitanya