వావ్.. గ్రీన్ డ్రెస్‌లో అందాలతో అదరహో అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది.

Update: 2025-01-19 05:31 GMT
వావ్.. గ్రీన్ డ్రెస్‌లో అందాలతో అదరహో అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్స్‌గానే నిలిచాయి. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీకి ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thatil)తో కలిసి రీసెంట్‌గా ఏడడుగులు వేసింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువవుతుంది. ఈ క్రమంలో ఈ భామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టా గ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పొంగల్ సెలబ్రేషన్స్ అంటూ.. గ్రీన్ చుడిదార్ ఎల్లో దుపట్టా, మెడలో తాళితో స్టన్నింగ్ లుక్‌లో ఫొటోలకి పోజులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ గ్రీన్ డ్రెస్‌లో సూపర్ ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News