అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గంటకు ఎంత చార్జ్ చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? (పోస్ట్)

‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోల వల్ల సంధ్య థియేటర్ వద్ద ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-12-13 14:49 GMT

దిశ, సినిమా: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోల వల్ల సంధ్య థియేటర్ వద్ద ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మెగా హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో.. ఆయన తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు సోమవారం విచారిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ కేసులో సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు.

ఈ కేసును నిర్మాత, వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్, అల్లు అర్జున తరపున వాదించి బయటకు వచ్చేలా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన ఏదైనా కేసును గంట వాదిస్తే ఏకంగా రూ. 5 లక్షలు చార్జ్ చేస్తాడని టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. అంటే అల్లు అర్జున్ కేసును 2 గంటలు వాదించినందుకు గానూ ఆయన రూ.10 లక్షలు తీసుకున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News