Ram Charan:రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడం పై నెట్టింట విమర్శలు.. స్వామీజీ ఏమన్నారంటే?
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(Hero Ram Charan) ఇటీవల అయ్యప్ప మాల ధరించి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(Hero Ram Charan) ఇటీవల అయ్యప్ప మాల ధరించి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడప దర్గాను హీరో రామ్ చరణ్ దర్శించుకోవడం పై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. పలువురు నెటిజన్లు పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల ధరించి దర్గాను దర్శించడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కడప దర్గాని సందర్శించిన రామ్ చరణ్ ఇస్లాం నియమాల ప్రకారమే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై వస్తున్న విమర్శలకి ఇప్పటికే ఆయన భార్య ఉపాసన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఈ ఘటన పై ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ స్పందించారు. దీనిపై గురూజీ రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ దర్గాను సందర్శించడంలో తప్పేం లేదని హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు. ‘‘అయ్యప్ప మాలేసి దర్గాకు ఎలా వెళ్తారు అని అంటున్నారు. కానీ రామ్ చరణ్ మిగిలిన వాళ్లతో పోల్చితే భక్తుడు, శివాలయంలో పూజలు చేస్తారు. కూతురుకి క్లింకార అని పేరు పెట్టారు. విదేశాలకు వెళ్తే రాములవారిని తీసుకెళ్తారు. ఎవరో పిలిచారని వెళ్లారంతే. ఆయనకు తెలియకపోతే మనం చెప్పాలి. ఎవరికైనా చరణ్ తప్పు చేసినట్లు అనిపిస్తే నా దగ్గరకు రండి కూర్చుని మాట్లాడుదాం. అంతే కానీ ఆయన గురించి తప్పుగా మాట్లాడ వద్దు’’ అని ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు.
“People who are criticizing @AlwaysRamCharan are caste fanatics(kulla picholu)” 🤣🤣
— Glass🥛It (@LetsGlassIt) November 21, 2024
“He is bigger devotee than anyone”
- Radha Manohar Das
Adi atta 🔥 #UniteSanatanaDharma pic.twitter.com/KQxaWoVYJK