Vishwak Sen: కీలక ప్రకటన విడుదల చేసిన విశ్వక్ సేన్.. క్షమాపణలు చెప్తూ ఎమోషనల్ నోట్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2025-02-20 13:22 GMT
Vishwak Sen: కీలక ప్రకటన విడుదల చేసిన విశ్వక్ సేన్.. క్షమాపణలు చెప్తూ ఎమోషనల్ నోట్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదాల మధ్య ఫిబ్రవరి 14న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, విశ్వక్ సేన్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి మూవీ వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను.

నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిటీ క్షమాపణలు చెప్తున్నాను. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఒకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే.

నా కెరీర్ స్టార్ చేసినప్పటి నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాగే నా మీ నమ్మకం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా హీరోయిన్స్, డైరెక్టర్స్, రచయితలు, వెన్నెముకగా నిలిచారు. అంతేకాకుండా నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మీ అందరి విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను. నా మంచి చెడుల్లో అండగా నిలిచారు. మీ మద్దతు నాకు చాలా ముఖ్యం’’ అని రాసుకొచ్చారు. 

Tags:    

Similar News