Virushka : త్వరలో నూతన గృహ ప్రవేశం చేయనున్న విరుష్క దంపతులు
త్వరలో విరుష్క(Virushka) దంపతులు నూతన గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం.
దిశ, వెబ్ డెస్క్ : త్వరలో విరుష్క(Virushka) దంపతులు నూతన గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం. అలీభాగ్(Alibhag) లో కొత్తగా నిర్మిస్తున్న వీరి ఇల్లు అందుకు ముస్తాబు అవుతోంది. ఆ ఇంటిని పువ్వులు, లైట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈవెంట్ నిర్వహకులు. ఇందుకు ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్నాయి. అయితే అలీభాగ్ లో 2022 లో రూ.19 కోట్లతో 8 ఎకరాల స్థలం కొన్నారు ఈ దంపతులు. దీనిలో రూ.13 కోట్లతో అన్నిరకాల ఆధునిక హంగులతో విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ (Viratakaohli - AnushkaSharma) తమ కలల ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా ఈ ఇంటి నిర్మాణం పూర్తయినందున గృహప్రవేశం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి.