చీరకట్టులో విరూపాక్ష బ్యూటీ.. పక్కా హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్

సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన సూపర్ హిట్ మూవీ విరూపాక్ష.

Update: 2024-09-26 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన సూపర్ హిట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు(Karhik Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటించింది. అయితే ఈ సినిమాలో సోనియా సింగ్(Sonia Singh) కూడా నటించింది. ఈ బ్యూటీ యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అలా న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్(New Age Girlfriend), సాఫ్ట్వేర్ సావిత్రి(Software Savithri) వంటి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక యమలీల(Yamaleela) సీరియల్‌తో బుల్లితెరపై మెరిసిన ఈ బ్యూటీ.. విరూపాక్ష(Virupaksha)తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సోనియా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా ‘హే పిల్ల’(Hey Pilla) అనే యూట్యూబ్ ఛానల్‌లో ఆడవారికి సంబంధించిన కంటెంట్ చేసి సూపర్ సక్సెస్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఊదా రంగు చీర కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే ‘ప్రతిధ్వనిగా కాకుండా వాయిస్‌గా ఉండండి’(Be a Voice, Not an echo)అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు పక్కా హీరోయిన్ మెటీరియల్ అని, సో బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to sonia singh instagram id)


Similar News