‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ నుంచి ట్రైలర్ విడుదల.. వేరే లెవల్ ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్

మోహన్(Mohan) దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’(Srikakulam Sherlock Holmes).

Update: 2024-12-16 14:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోహన్(Mohan) దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’(Srikakulam Sherlock Holmes). ఈ సినిమాలో వెన్నెల కిషోర్(Vennela Kishore) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. డిసెంబరు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల(Ananya Nagalla) కూడా మెయిన్ లీడ్ పోషించనుంది. ఈ మూవీ మొత్తం శ్రీకాకుళం యాస(Srikakulam language)లో ఉండనుందట. అయితే తాజాగా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ చిత్రం నుంచి తాజాగా మూవీ టీమ్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసినట్లైతే.. ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతాయని తెలుస్తోంది. కానీ ఎవరు చంపుతున్నారు..? ఎందుకు అలా చేస్తున్నారో మాత్రం ఎవరికీ అర్థం కాదు.. చివరకు పోలీసులు కూడా కనిపెట్టలేకపోతారు. అప్పుడే హీరో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తాడు. హత్యలకు గల కారణమేంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.ఇంట్రెస్టింగ్‌గా సాగుతోన్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Full View
Tags:    

Similar News