Amala Paul: నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ఇదే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అమలా పాల్

స్టార్ హీరోయిన్ అమలా పాల్(Amala Paul) ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది.

Update: 2024-12-06 15:25 GMT
Amala Paul: నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ఇదే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అమలా పాల్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అమలా పాల్(Amala Paul) ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన ఆమె గత కొద్ది కాలంగా దూరంగా ఉంటుంది. పూర్తిగా తమిళ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇక అమలా పాల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత ఏడాది నవంబర్‌లో తన ప్రియుడు జగత్ దేశాయ్‌(Jagat Desai)ను రెండోసారి పెళ్లి చేసుకుంది. అయితే వీరికి ఇటీవల కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం అమలా పాల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది.

ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరి(First wedding anniversary)కి తన భర్త సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా అద్భుతమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఈ సంవత్సరం కుమరకోమ్‌లో జరిగిన మరపురాని ఆశ్చర్యం, ప్రతిరోజూ రొమాన్స్‌ను సజీవంగా ఉంచే వ్యక్తిని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇది జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోంది. నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్‌లు(Surprises) ఎప్పటికీ గుర్తుంటాయి. ఇది నిజంగా ఎలా జరిగిందో నా మాజీలందరికీ చూపుతోంది!’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అమలా పాల్ నది మధ్యలో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Read More...

Lavanya: లవ్ సింబల్ జోడించి టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్.. ఫొటోలు-వీడియోలు వైరల్


Full View

Tags:    

Similar News