Mohanlal: నా ప్రయాణంలో ఇదొక గొప్ప అధ్యాయం.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

2019లో వచ్చిన ‘లూసిఫర్’ (Lucifer) చిత్రం బ్లాక్ బ‌స్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-01 10:44 GMT

దిశ, సినిమా: 2019లో వచ్చిన ‘లూసిఫర్’ (Lucifer) చిత్రం బ్లాక్ బ‌స్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ (L2 Empuran) రూపొందుతోంది. మ‌ల‌యాళ (Malayalam) సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌ (Mohan Lal) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెర్సటైల్ యాక్టర్‌, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తొలి భాగం హిట్ కావ‌టంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్‌ (Lyca Productions) నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హై ఎక్స్‌పెక్టేషన్ ఉన్న ‘L2 ఎంపురాన్’ వ‌చ్చే ఏడాది మార్చి 27న చిత్రం తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ‌, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యినట్లు క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు మోహన్ లాల్.

‘UK, USA, UAEతో సహా 8 రాష్ట్రాలు అండ్ 4 దేశాలలో 14 నెలల అద్భుతమైన ప్రయాణం. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన క్రియేటివిటీ (Creativity)తో ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అద్భుతంగా ఎలివేట్ (elevate) చేశారు. ఈ చిత్రానికి మంచి కథను అందించిన మురళీ గోపీ (Murali Gopi)కి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం ఉంచి మాకు అమూల్యమైన మద్దతునిచ్చిన ఆంటోనీ పెరుంబవూరుకు, శ్రీ సుభాస్కరన్ అండ్ లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరెవరు లేకుంటా ఈ ప్రాజెక్ట్ సాధ్యం అయ్యేది కాదు. L2: ఒక కళాకారుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం.. నేను ఎప్పుడూ దీనిని విలువైనదిగా భావిస్తాను. అద్భుతమైన ప్రేక్షకులకు, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి. చూస్తూనే ఉండండి.. ఇంకా చాలా ఉన్నాయి!’ అని ట్వీట్ పెట్టారు. కాగా.. ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్యప్పన్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

Tags:    

Similar News