Rahul Ramakrishna: ఇంట్లో వాళ్ళే కిందకి లాగుతారు.. అయినా మూడు నెలల్లో చేసి చూపిస్తానంటూ రాహుల్ సెన్సేషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2025-03-03 09:13 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్రెండ్‌గా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో రాహుల్ రామకృష్ణకు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన ‘జాతి రత్నాలు’(Jathi Ratnalu) సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

తనదైన నటనతో టాలీవుడ్‌లో మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. గత కొద్ది కాలంగా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన రాహుల్ వరుస పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నిసార్లు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఆయన పోస్టులు నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, రాహుల్ రామకృష్ణ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తీసుకున్నాడు. కానీ తన ఇంట్లో వాళ్లు మాత్రం మున్నాళ్ల ముచ్చటే అని అంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు. ‘‘దయచేసి నాకు ఎవరైనా ట్రెడ్‌మిల్ దానం చేయండి. నేను వర్కౌట్స్ చేసి మూడు నెలలో ఫిట్‌గా మారాలనుకుంటున్నాను. కేవలం నన్ను డీఎమ్ చేసి ఆశీర్వదించండి. అయితే నేను మా ఇంట్లో వాళ్లకి ట్రెడ్ మిల్ కొనుకొని మూడు నెలల్లో ఫిట్‌గా అవుతానని చెప్పాను.

మూడు నెలలలో ముచ్చటగా తయారవుతారంటే.. అవన్నీ మున్నాళ్ల ముచ్చటనే.. ఆ తర్వాత ట్రెడ్ మిల్ బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తుంది అంటున్నారు. ప్యాషన్, డెడికేషన్ టాలెంట్‌, టైమ్ మానేజ్‌మెంట్‌ను మొదట చంపేది ఇంట్లో వాళ్ళు కిందకు లాగుతారు. అమ్మతోడు ఆత్రం ఆపులకోలేకపోతున్నాను. కొద్ది రోజుల్లో దుమ్ము లేపే అప్డేట్ ఇవ్వబోతున్నాను. మా నాన్న మాటను వినదల్చుకోలేదు. ఎవని అయ్యకి వినేది లేదు. ఫిట్‌గా మారుతా.. మూడు నెలల్లో నేను అనుకున్నది చేసి చూపిస్తా’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు ఏం అప్డేట్ ఇవ్వబోతున్నాడో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

 

 

 

 

Tags:    

Similar News