మానసికంగా హింసిస్తున్నారు.. ఎమోషనల్ నోట్ విడుదల చేసిన కరణ్ జోహార్.. కారణం ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ నిర్మాత, నటుడు కరణ్ జోహార్(Karan Johar) పలు చిత్రాలు తెరకెక్కించడంతో పాటు ఆయన ‘కాఫీ విత్ కరణ్’(Koffee with Karan)అనే షో ద్వారా ఆయన పలువురు సెలబ్రిటీలను పిలిచి ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాత, నటుడు కరణ్ జోహార్(Karan Johar) పలు చిత్రాలు తెరకెక్కించడంతో పాటు ఆయన ‘కాఫీ విత్ కరణ్’(Koffee with Karan)అనే షో ద్వారా ఆయన పలువురు సెలబ్రిటీలను పిలిచి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ అవన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. అయితే ఇటీవల కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘నాదానియన్’(nadaniyaan) భారీ అంచనాల మధ్య వచ్చి మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాను చూసిన వారంతా ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఆయన గురించి దారుణంగా మాట్లాడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
‘‘నేను 2003లో కల్ హేనా హోతో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాను. కథకులు, మేకర్స్‌కు అధికారం ఇవ్వడం అంటే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నట్టే అని అర్థం. అయితే ధర్మ సంస్థలో 24వ డెబ్యూ దర్శకుడిగా పరిచయం చేసామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎలాంటి చిత్రానికైనా విమర్శలు సహజం. మీరు చేసే ట్రోల్స్ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయినప్పటికీ నాకు విమర్శించే వారిపై ఎలాంటి కోపం లేదు. వారిని చూసి జాలి పడతాను. తెర వెనుక ఉండి మాట్లాడటం చాలా తేలిక. సినిమా విషయంలో ఎవరి అభ్రిప్రాయాలు వారికి ఉంటాయి. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోవద్దని భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అన్నింటిని స్వాగతించాలి. కానీ మాటలతో వ్యక్తిగతంగా ఒకరిపై దాడి చేసే అధికారం మీకు లేదు.ఇలా మాట్లాడటం ఒక మనిషికి మానసికంగా హింసించడంతో సమానం.
కాబట్టి దయచేసి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడటం మంచిదని అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కరణ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. సినీ సెలబ్రిటీలు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇక నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా, ‘నాదానియన్’ మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీఖాన్(Ibrahim Ali Khan) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor)నటించింది. అయితే ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి మార్చి 7న వచ్చింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఖుషీ, ఇబ్రహీం నటనపై పలు విమర్శలు వచ్చాయి.
Read More..
వావ్ పోస్టర్ అదిరింది గురు.. తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. దేనిగురించంటే..?