డేటింగ్‌లో మునిగి తేలుతున్న టాలీవుడ్ స్టార్ కపుల్స్ వీళ్లే.. మరి పెళ్లి పీటలు ఎక్కుతారా..?
ప్రస్తుత రోజుల్లో పెళ్లికి ముందే లవ్ కపుల్స్ డేటింగ్‌లో ఉండడం.. కామన్ అయిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పెళ్లికి ముందే లవ్ కపుల్స్ డేటింగ్‌లో ఉండడం.. కామన్ అయిపోయింది. ఒకప్పుడు డేటింగ్ కల్చర్ అనేది విదేశాల్లో మాత్రమే వినిపించేది.. కానీ ఇప్పుడు మన ఇండియా మొత్తం అదే విధానం నడుస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో. మొన్నటి వరకు బాలీవుడ్‌లో పలు జంటలు డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్‌లో కూడా కొన్ని జంటలు డేటింగ్‌లో మునిగితేలుతున్నాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.
అలాంటి వారిలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ-రష్మిక గురించి. ఈ ఇద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు. వీరు ఎవరికీ తెలియకుండా ఇటీవల మాల్దీవులకు కలిసి వెళ్లారు. ఒకే ప్లేస్‌లో వేర్వేరుగా దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. అలాగే రష్మిక లైవ్ చాట్‌లోకి అనుకోకుండా విజయ్ వాయిస్ వినిపించడం, మొన్న హైదరాబాద్‌కు వచ్చిన రష్మిక.. విజయ్ ఇంటి గార్డెన్‌లో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి, మరోసారి దొరికిపోయింది. దీంతో వీరిద్దరి నిజంగానే డేటింగ్‌లో ఉన్నారని జనాలు ఫిక్స్ అయిపోయారు.
అలాగే హీరోయిన్ అదితి రావు హైదరీ-తమిళ హీరో సిద్ధార్థ్, మరో ప్రేమజంట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా అండ్ విజయ్ వర్మ. ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటి వరకు సినిమాల్లో ఒక్కరితో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. కానీ ప్రియుడు విజయ్‌తో లిప్ లాక్ సీన్లతో ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే మేమిద్దరం నిజంగానే డేటింగ్‌లో ఉన్నామంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు పుల్‌స్టాప్ పెట్టింది. ఇక ఈ జంటలు పెళ్లి వరకు వెళ్తాయా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.