తండ్రిని ఎదిరించి సీఎంను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

రాధికకుమారస్వామి అంటే మనకు ఎవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ.. కన్నడ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈ భామ తెలియని వారు ఎవరూ ఉండరు.

Update: 2024-09-29 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాధికకుమారస్వామి అంటే మనకు ఎవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ.. కన్నడ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈ భామ తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ బ్యూటీ హీరోయిన్‌గా కంటే మాజీ సీఎంతో అమెకున్న సంబంధాల కారణంగానే ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచేది. 2006లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో ఆమెకున్న రిలేషన్ గురించి సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయ వర్గాల వరకు ఎన్నో చర్చలు నడిచాయి. దీంతో ఆమె సినీ జీవితం అక్కడితో క్లోజ్ అయింది. ఇక మరోవైపు కుమారస్వామి రాజకీయ జీవితం కంటే ఆయన వ్యక్తిగత జీవితం పైనే ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు.

మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయ్యా అంటే.. కుమార స్వామితో పెళ్లి సమయంలో రాధిక ఆయనకంటే 27 సంవత్సరాల చిన్నది. అంతేకాదండోయ్ వీరిద్దరికి అది రెండో వివాహం. కుమార స్వామి మొదటి పెళ్లి అనితతో 1986లో జరిగింది. ఇక రాధిక మొదటి పెళ్లి 2000 సంవత్సరంలో జరిగింది.. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఆ సమయంలో రాధిక తండ్రి మాజీ ముఖ్యమంత్రితో తన కుమార్తె పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ పెద్దలను ఎదిరించి రాధిక.. కుమారస్వామిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో రాధిక నిర్ణయం కర్ణాటకలో పెను సంచలనమే సృష్టించింది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. దాదాపు 30 కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో కూడా ఈమె నందమూరి హీరో తారకరత్న హీరోగా వచ్చిన ‘భద్రాద్రి రాముడు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కుమారస్వామితో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత నిర్మాతగా మారి ‘లక్కీ’ అనే సినిమాను నిర్మించింది. ప్రస్తుతం రాధిక సినిమా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిని పెళ్లాడి కోటీశ్వరురాలైంది. కాగా పలు నివేదికల ప్రకారం ఆమె ఆస్తి విలువ.. రూ.124 కోట్లు, ఆమె భర్త కుమారస్వామి ఆస్తి విలువ రూ.44 కోట్లు.


Similar News