డిప్యూటీ CM డాన్స్ చేసిండ్రోయ్.. అదిరిపోయిన ‘హరిహర వీరమల్లు’ రెండో పాట (వీడియో)

పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి రెండో పాట(HHVM Second Song) విడుదలైంది.

Update: 2025-02-24 10:14 GMT
డిప్యూటీ CM డాన్స్ చేసిండ్రోయ్.. అదిరిపోయిన ‘హరిహర వీరమల్లు’ రెండో పాట (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి రెండో పాట(HHVM Second Song) విడుదలైంది. ‘కొల్లగొట్టినాదిరో.. నా గుండె కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి ఐదు భాషల్లో ఈ పాటను సోమవారం మధ్యాహ్నం చిత్రబృందం విడుదల చేసింది. తెలుగులో ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj), ఫోక్ సింగర్ మంగ్లీ, రమ్య బెహర, యామిని గంటసాల పాడారు. హీరోయిన్ నిధి అగర్వాల్‌(Nidhi Aggarwal)తో పాటు మరో నటి పూజిత పొన్నాడ, స్టార్ యాంకర్ అనసూయ(Anasuya)తో కలిసి పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టెప్పులేశారు.

Full View

మరో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందించగా.. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం(AM Ratnam) నిర్మిస్తున్నారు. వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు, ఒక పాట సూపర్ డూపర్ హిట్ అవ్వగా.. తాజాగా విడుదల చేసిన రెండో పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను వీక్షించిన అభిమానులంతా డిప్యూటీ సీఎం డాన్స్ చేసిండ్రోయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News

Vaishnavi Chaitanya