‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్‌ అగ్గిపుల్లె పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్

రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ప్రస్తుతం ‘దిల్ రుబా’(Dilruba) సినిమాలో నటిస్తున్నాడు.

Update: 2025-01-15 12:58 GMT
‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్‌ అగ్గిపుల్లె పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ప్రస్తుతం ‘దిల్ రుబా’(Dilruba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వ కరుణ్(Vishwa Karan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలీంతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్(Rukshar Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. దిల్ రూబా నుంచి ఫస్ట్ సింగిల్(First Single) అగ్గి పుల్లె(Aggipulle) సాంగ్ జనవరి 18న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారగా.. కిరణ్ అబ్బవరం అభిమానులు ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News

Eesha Rebba