ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా ‘పెరుసు’.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

గత కొద్ది రోజుల నుంచి ఊహించని విధంగా చిన్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద ఘన విజయాలు సాధిస్తున్నాయి.

Update: 2025-04-04 06:24 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఊహించని విధంగా చిన్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద ఘన విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఇటీవల కోలీవుడ్‌లో తెరకెక్కిని లేటెస్ట్ మూవీ ‘పెరుసు’. ఈ సినిమా మార్చి 14న విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తెలుగులో ‘పెద్ద’ పేరుతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. అయినప్పటికీ నెలరోజులకే ‘పెరుసు’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ విజయాన్ని తెలియజేస్తూ.. ప్రముఖ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘పెరుసు’ (perusu) సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 11 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హిందీలో ఎప్పుడు వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇందులో వైభవ్(Vaibhav), నిహారిక (niharika) జంటగా నటించారు. ఇళంగో రామ్(Ilango Ram) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ రెడ్డి(Sunil Reddy), బాల శరవణన్(Bala Saravanan), రెడిన్ కింగ్స్‌లీ, చాందిని(Chandni), తమిళరసన్ వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. అయితే (టాంటిగో) ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.

Tags:    

Similar News