Game changer : ఫోటోగ్రాఫర్లకు దొరక్కకుండా కార్ ఎక్కిన 'గేమ్ ఛేంజర్' హీరోయిన్.. కారణం అదేనా..? ( వీడియో )
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సైలెంట్ గా తన కార్ ఎక్కేసి వెళ్లిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. 'ఆర్ఆర్ఆర్' వంటి పెద్ద హిట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా మన ముందుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ, ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో లాంగ్ రన్ లో నిలవలేకపోయింది.
కియారా అద్వానీ ( Kiara Advani ) సినీ కెరీర్లో 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. బాలీవుడ్లోనే కాకుండా తెలుగులో కూడా ఈ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ కారణంగా కియారా డిజప్పాయింట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఎప్పుడూ ఫోటోగ్రాఫర్లు కనిపించిన హ్యాపీ స్మైల్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సైలెంట్ గా తన కార్ ఎక్కేసి వెళ్లిపోయింది. దీంతో 'గేమ్ ఛేంజర్' మూవీ వలనే కియారా హర్ట్ అయిందని, ఆమె ముఖంలో సంతోషం కూడా లేదని, అందుకే ఫోటోలివ్వకుండా ముఖం చాటేసిందని నెటిజన్స్ అంటున్నారు.