అలాంటి పాత్రలు ఎంచుకున్నందుకు నన్ను విమర్శించారు.. హీరోయిన్ కామెంట్స్
గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుక స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుక స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడకు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు హాజరై సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వేడుకలో పాల్గొన్న నిత్యా మీనన్(Nithya Menon).. కెరీర్ స్టార్టింగ్‌లో తను ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది.
‘ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు ఎంచుకున్నందుకు విమర్శించారు. దీంతో ఆ తర్వాత కథలు ఎంపిక విషయంలో విధానాన్ని మార్చుకున్నా. నటన అనేది ఎమోషన్‌కి సంబంధించింది. దానికి వ్యక్తి గత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు. వాటిలో ఉండే ఫీలింగ్స్ స్క్రీన్‌పై చూడగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే గుర్తింపు లభిస్తుంది. గతంలో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. దీంతో ఎమోషనల్ సీన్స్ చాలా ఈజీగా చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు నేను ఆనందంగా ఉంటున్నానేమో’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More...
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్