రజినీకాంత్ దొంగలా ఉన్నాడని పెళ్లికి నో చెప్పిన అమ్మాయి..?
తమిళ హీరో రజినీకాంత్ ఇండియాలోనే సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల జైలర్ సినిమాతో హిట్ కొట్టాడు.
దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో రజినీకాంత్ ఇండియాలోనే సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల జైలర్ సినిమాతో హిట్ కొట్టాడు. తాజాగా, గతంలో ఆయన పెళ్లి చూపులప్పుడు జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. రజినీకాంత్ సినిమాల్లోకి రాకముందు గవర్నమెంట్ బస్ కండక్టర్‌గా పని చేశారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బస్ కండక్టర్ గా చేసే టైంలో ఓ అమ్మాయి తన బస్సులో రోజు వచ్చి తనని సినిమాల్లో ట్రై చేయమని చెప్పింది, అంతేకాకుండా ఆ అమ్మాయి రజినీకాంత్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆయనకు సినిమాలపై ఉన్న ఇష్టం తెలిసి సినిమాలకు వెళ్తే స్టార్ హీరో అవుతావని ప్రోత్సహించి ఇండస్ట్రీకి పంపిందట.
డబ్బులు లేకపోతే ఆమెనే ఇచ్చి పంపినట్లు సమాచారం. అయితే రజినీకాంత్ స్టార్ హీరో అయ్యాక ఆమెను కలవడానికి పోతే ఆ అమ్మాయి ఆచూకీ తెలియలేదట. ఆ తర్వాత పెళ్లి చూపులకని ఓ అమ్మాయిని చూడటానికి వెళ్లారట. కానీ ఆ అమ్మాయి రజినీకాంత్‌ను చూసి ఈయనేంటి అచ్చం దొంగలా ఉన్నాడు. అలాగే చాలా నల్లగా కూడా ఉన్నాడు. నాకు ఇష్టం లేదు అని రిజెక్ట్ చేసిందట. అలా పెళ్లి చూపుల్లో అవమానించినందుకు తలైవా ఎంతో బాధపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Read More: మళ్లీ రెచ్చిపోయిన సురేఖ వాణి కూతురు.. కుర్రాళ్లకు ఇక నిద్రపట్టేదెలా..?