‘ప్రియమరా’ సాంగ్ విడుదల.. లిరిక్స్ సూపర్ ఉన్నాయంటూ నెటిజన్ల కామెంట్స్

ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) బుల్లితెర యాంకర్‌గా పరిచయం అయి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Update: 2025-04-05 12:42 GMT
‘ప్రియమరా’ సాంగ్ విడుదల.. లిరిక్స్  సూపర్ ఉన్నాయంటూ నెటిజన్ల కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) బుల్లితెర యాంకర్‌గా పరిచయం అయి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన అట్రాక్టీవ్‌ మాటలతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు. ఇక బుల్లితెరపై వరుస షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతేకాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హిట్ మూవీ టైటిల్‌ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi) పెట్టారు. ఈ సినిమాలో జబర్దస్త్ బ్యూటీ దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే సత్య, గెటప్ శ్రీన్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు భరత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్స్‌లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తమ సినిమావైపుకు తిప్పుకుంటున్నారు. తాజాగా, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం నుంచి నాలుగో పాట విడుదలైంది. ‘‘ప్రియమరా.. మౌనాల చాటు మాటలే తెలియదా’’ అని సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లిరిక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News