దారుణంగా మోసపోయిన స్టార్ సింగర్.. ఫుడ్ తినేందుకు కూడా డబ్బులు లేవంటూ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్‌(Neha Kakkar)కు పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాటలు పాడిన ఆమె చాలామంది అభిమానులు సంపాదించుకుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి నెట్టింట విమర్శలు ఎదుర్కొంటుంది.

Update: 2025-03-28 12:10 GMT
దారుణంగా మోసపోయిన స్టార్ సింగర్.. ఫుడ్ తినేందుకు కూడా డబ్బులు లేవంటూ ఎమోషనల్ పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్‌(Neha Kakkar)కు పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాటలు పాడిన ఆమె చాలామంది అభిమానులు సంపాదించుకుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి నెట్టింట విమర్శలు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అయితే ఇటీవల నేహా కక్కర్ మెల్ బోర్న్‌లోని మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొంది. కానీ ఈ ఈవెంట్‌కు ఆమె మూడు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆడియన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఈవెంట్ పెట్టడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నేహా కక్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘నేను ఈవెంట్‌కు మూడు గంటలు లేట్‌గా వచ్చాను అని అందరూ నన్ను తిడుతున్నారు.

కానీ అసలు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో అడగటం లేదు. అయితే అక్కడే ఈ విషయాన్ని చెప్పి నన్ను తిట్టిన వారందరినీ శిక్షించాలని అనుకున్నాను. కానీ అలా చేయడానికి నేను ఎవరిని. ఇప్పుడు మాత్రం నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఆ ఈవెంట్‌ను పూర్తిగా ఉచితంగానే చేశానని మీలో ఎవరికైనా తెలుసా?.. ఆర్గనైజర్లు మధ్యలోనే పారిపోయి నన్ను దారుణంగా మోసం చేశారు. మా డబ్బుల్ని వారు ఎత్తుకెళ్లిపోయారు. నా టీంకి కనీసం ఫుడ్ పెట్టేందుకు కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. హోటల్ లేదు.. ఫుడ్ లేదు.. నీళ్లు లేవు.. నా భర్తే నా టీంకు అండగా నిలబడ్డాడు. ఇంత జరిగినా కూడా మేం స్టేజ్ మీదకు వచ్చాం.

ఎలాంటి విశ్రాంతి లేకుండా షోను చేశాం. నా అభిమానుల్ని నిరాశపర్చొద్దనే ఉద్దేశంతోనే ఆ షోను ఎంత కష్టమైనా కూడా కంటిన్యూ చేశా. సౌండ్ విషయంలోనూ మేం మోసపోయాం.. చివరి నిమిషంలో సౌండ్ సిస్టం నిర్వాహకులు కూడా చేతులు ఎత్తేశారు. స్పాన్సర్లు పారిపోయారు నా మేనేజర్ ఫోన్లను కూడా వాళ్లు ఎత్తలేదు. నేను ఇంకా ఎంతో చెప్పుకునేది ఉంది. కానీ ఇది మాత్రం చాలనిపిస్తుంది. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నా టీం, నా ఫ్యాన్స్ నాకు అండగా నిలబడ్డారు.. వారందరికీ థాంక్స్.. ఆరోజు నా ఈవెంట్‌కు అటెండ్ అయిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాతో పాటు కొందరు ఏడ్చారు.. ఇంకొందరు నాతో పాటుగా డ్యాన్స్ చేశారు.. మరి కొందరు నా బాధను పంచుకున్నారు.. నా కోసం అండగా నిల్చున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని వరుస పోస్టులు షేర్ చేసింది. ప్రస్తుతం నేహా కక్కర్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Tags:    

Similar News