హత్య కేసులో జైల్లో స్టార్ హీరో దర్శన్.. బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న భార్య..

కన్నడ స్టార్ హీరో దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర వీడియోలు పంపిస్తున్నాడనే కోపంతో చిత్ర దుర్గంకు చెందిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-11 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర వీడియోలు పంపిస్తున్నాడనే కోపంతో చిత్ర దుర్గంకు చెందిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు హత్యకు కారణమైన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. దర్శన్ అరెస్ట్ అయ్యాక ఆమె భార్య విజయలక్ష్మి తన భర్త గురించి తప్పుగా ప్రమోట్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగుళూరులో జరిగిన తన బెస్ట్ ఫ్రెండ్ శృతి రమేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. అక్కడ ఆ పార్టీలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోడలు స్మితా కూడా హాజరవడం గమనార్హం. కాగా ఈ పిక్స్ చూసిన నెటిజన్లు భర్త జైల్లో ఉంటే బర్త్‌డే పార్టీలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు.

 


Similar News