Ajay Devgn: రిలీజ్‌కు సిద్ధమైన స్టార్ హీరో సీక్వెల్.. పోస్టర్ వైరల్

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రైడ్’ (ride).

Update: 2024-12-04 14:29 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రైడ్’ (ride). రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇలియానా (Ileana) హీరోయిన్‌గా నటించగా.. సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. 2018లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ (box office) వద్ద సూపర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక 6 సంవత్సారాల తర్వాత ఈ మూవీ సీక్వెల్ (sequel)కు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే.. సీక్వెల్‌గా వస్తున్న ‘రైడ్-2’ (Ride-2)లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

ఈ సినిమా గతంలో 2025 ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను మార్చుతూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు అజయ్ దేవగన్ తన X ఖాతాలో ‘రైడ్-2’ 2025 మే-1న మీ ముందుకు తీసుకొస్తున్నాము.. అంతా సిద్ధం అయిందని చెప్పుకొచ్చాడు. కాగా.. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ‘రైడ్’ చిత్రాన్ని తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో రీమేక్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Tags:    

Similar News