సమంత-నాగచైతన్య విషయం తెలిసి శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

సమంత- నాగచైతన్యకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. వీరిద్దరి పేర్లను జనాలు ఓ మంత్రంలా జపిస్తున్నారు.

Update: 2023-12-29 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమంత- నాగచైతన్యకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. వీరిద్దరి పేర్లను జనాలు ఓ మంత్రంలా జపిస్తున్నారు. అయితే ఒకప్పుడు సామ్, చై ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి జనాలు ఈ జంట కలవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా పలువురు అభిమానులు సైతం వారిని పదే పదే పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. స్టార్ సెలబ్రెటీస్ కూడా వీళ్ళు విడాకులు తీసుకున్న విషయంపై ఇప్పటికీ చర్చించుకుంటున్నారట. అలాగే కొందరు తమ బాధను కూడా అప్పట్లో పోస్టులుగా పెట్టుకున్నారు. తాజాగా, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల సమంత-నాగచైతన్య విడాకుల గురించి తెలిసి చాలా బాధపడిందట. మొదటి నుంచి శ్రీలీలకు సమంత అంటే చాలా చాలా ఇష్టమట . ఆమెను రోల్ మోడల్ గా తీసుకుంది. కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టిన హీరోయిన్గా సమంతకు మంచి పేరుంది.

అయితే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిందట శ్రీలీల. అంతేకాదు వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని కూడా అప్పట్లో ఫోన్లో డీపీ గా .. వాల్ పేపర్ గా పెట్టుకొని బాగా ఆనందపడిందని తెలుస్తోంది . అయితే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని తెలిసి చాలా చాలా బాధపడిందట. వాళ్లు కలిసే ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేసిందని టాక్. విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో శ్రీలీల వెక్కి వెక్కి ఏడ్చిందట. రెండు, మూడు రోజుల అన్నం కూడా మానేందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News