Siva Karthikeyan: కొత్త సినిమా అనౌన్స్ చేసిన శివ కార్తికేయన్.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) రీసెంట్‌గా ‘అమరన్’(Amaran) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2024-12-16 14:10 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) రీసెంట్‌గా ‘అమరన్’(Amaran) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో నెలరోజుల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తోంది. ఇక ప్రజెంట్ ‘అమరన్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శివ కార్తికేయన్.. తాజాగా ‘గురు’, ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ డైరెక్టర్ సుధా కొంగరతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.

'SK 25' అనే వర్కింగ్ టైటిల్‌ (Working title)తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆకాశ భాస్కరన్ నిర్మిస్తుండగా.. జయం రవి (Jayam Ravi), అథర్వ (Atharva) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తాజాగా చెన్నై (Chennai)లో లాంఛనంగా స్టార్ట్ అయింది. 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుండగా.. ఇందులో శివకార్తికేయన్ విప్లవాత్మక ఆలోచనలుండే స్టూడెంట్‌గా కినిపించనున్నాడని టాక్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree leela) హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Tags:    

Similar News