SITHARA: అమ్మ చాలా స్ట్రిక్ట్.. నాన్న ఫస్ట్ చూసి ఏడ్చేశాడు.. సితార షాకింగ్ కామెంట్స్(వీడియో)
మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అడుగుపెట్టనప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీ కిడ్ అయినప్పటికీ ఒక స్టార్ రేంజ్‌కు ఉండాల్సినంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ ప్రిన్సెస్ ఇప్పటికే పలు యాడ్స్, సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది. అందులో భాగంగా కొన్ని ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సితార తన ఫస్ట్ యాడ్ PMJ జ్యువెల్లర్స్‌కి చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ బాగా వైరల్ కూడా అయింది. అయితే ఆ యాడ్ చూసినప్పుడు మహేష్ ఎలా స్పందించాడో తాజాగా సితార తెలిపింది. సితార మాట్లాడుతూ.. “నాన్న నా ఫస్ట్ యాడ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు బాగా గుర్తుంది నాన్న నా యాడ్ చూసి ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే.. ఇంట్లో అమ్మ చాలా స్ట్రిక్ట్. నాన్న నన్ను గారాబం చేస్తారు. నేను స్కూల్ బంక్ కొట్టేది మా నాన్న వల్లే. మా నాన్నకి వర్క్ లేనప్పుడు నన్ను స్కూల్‌కి వెళ్లొద్దు అంటారు. నన్ను స్కూల్‌కి పంపించొద్దు అని మా అమ్మతో గొడవ పడతాడు. అప్పుడు నాతో సమయం గడుపుతారు” అని సితార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nanna almost cried after watching my first AD 🥹- #SitaraGhattamaneni#MaheshBabu pic.twitter.com/2RyjW26TZC
— VardhanDHFM (@_VardhanDHFM_) August 27, 2024
Somehow Nanna convinces amma and I bunk school - #SitaraGhattamaneni#MaheshBabu #NamrataShirodkar pic.twitter.com/8fwGXVEI1W
— VardhanDHFM (@_VardhanDHFM_) August 27, 2024
(video link credits to VardhanDHFM X account)