షాకింగ్ న్యూస్ రజినీకాంత్ కూతురుతో స్టార్ హీరో జయం రవి పెళ్లి.. బయటపడ్డ అసలు నిజం?
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అందరికీ సుపరిచితమే. ఆయన కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అందరికీ సుపరిచితమే. ఆయన కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల జయం రవి పొన్నియన్ సెల్వన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. జయం రవి, ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. అలాగే ఆర్తి పెళ్లి ఫొటోలను డిలీట్ చేసినట్లు పుకార్లు షికార్లు చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. కానీ డైవర్స్ తీసుకుంటున్నట్లు ఆర్తి, జయం రవి ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు.
అలా అని విడాకుల వార్తలను ఖండించకపోవడంతో నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో.. ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ ప్రముఖ జర్నలిస్ట్ జయం రవి పెళ్లి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. జయం రవి సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిని పెళ్లి చేసుకునేవాడట. దీనిపై అప్పట్లో పలు చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. కానీ ఖుష్బూ వల్ల జయం రవి, ఆర్తి ప్రేమించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆర్తి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పకోవడంలో జయం రవి భార్యగా ఆర్తి వచ్చింది.
లేదంటే రజినీకాంత్ అల్లుడు అయిపోయేవాడని జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారు అయినా బాగుండేది అని అంటున్నారు. కాగా, రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులు పుట్టాక విడాకులు తీసుకుంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనను రిలీజ్ చేయనప్పటికీ ఐశ్యర్య కూమారులతో తండ్రి దగ్గరే ఉండటంతో అంతా ధనుష్‌తో విడాకులు తీసుకోవడం వల్లేనని ఫిక్స్ అయిపోయారు.