షాకింగ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో విశాల్.. ఆందోళనలో ఫ్యాన్స్

తమిళ స్టార్ హీరో విశాల్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగులో పందెం కోడి, పొగరు, భరణి, పూజా వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Update: 2025-01-06 03:27 GMT

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగులో పందెం కోడి, పొగరు, భరణి, పూజా వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరం అయిన విశాల్.. తాజాగా తాను నటించిన సినిమా ‘మదగజరాజ’ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కావడం గమనార్హం. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన విశాల్‌ను చూసి అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అతని పరిస్థితి చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అయితే ఈ ఈవెంట్‌లో ఆయన మొఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. ఇక అతన్ని అలా చూసిన అతని ఫ్యాన్స్, నెటిజన్లు విశాల్‌కు ఏమైందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా విశాల్ తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. మరి నిజంగా జ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీమ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో విశాల్‌కి జంటగా అంజలీ, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ నటుడు ఆర్య గెస్ట్ రోల్‌లో నటించగా.. సోనూసూద్, సంతానం కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు.

Tags:    

Similar News