Ram Charan: ‘గేమ్ చేంజర్’ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game changer).

Update: 2024-12-16 14:17 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game changer). దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్తుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, సునీల్, సముద్రఖని, SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ఈ మూవీ 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచుతూ వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తు్న్నారు చిత్ర బృందం.

ఇందులో భాంగంగా తాజాగా బిగ్ బాస్-8 (Bigg Boss-8) కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన రామ్ చరణ్.. ‘గేమ్ చేంజర్’ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘శంకర్ స్ర్కీన్ ప్లే సూపర్ హిట్ చిత్రాలను గుర్తుచేస్తుంది. అందులో ఆయన మాస్టర్. ‘గేమ్ చేంజర్’ ఫుల్ మాస్ పొలిటికల్ ఎంటర్టైనర్. రాజమౌళితో RRR సినిమా చివరి షెడ్యూల్డ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. దీని కంటే బెస్ట్ రాదు అనుకున్నాను. శంకర్‌లతో కలిసి పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తాను. శంకర్ సినిమాలో నటించే చాన్స్ రావడం నా అదృష్టం. అందుకే ఆయన కాల్ చేసి చెప్పగానే ఓకే చేశాను. కచ్చితంగా ఈ చిత్రం అందరనీ మెప్పిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More...

గెట్ రెడీ.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో సాంగ్.. తమన్ ట్వీట్ వైరల్


Tags:    

Similar News